టెన్త్ ఫెయిలయ్యాడని స్వీట్లు పంచి.. ఊరేగించారు!

Wed,May 16, 2018 03:37 PM

A Family in Madhya Pradesh celebrates his sons failure in Tenth board exams

భోపాల్: పరీక్షల్లో ఫెయిలైతే తిట్టే, కొట్టే తల్లిదండ్రులను చూశాం. మరి తమ కొడుకు ఫెయిలయ్యాడంటూ ఆనందంతో స్వీట్లు పంచి.. అదో పండుగలా సెలబ్రేట్ చేసిన వాళ్లను ఎవరినైనా చూశారా? మధ్యప్రదేశ్‌లో ఈ వింత జరిగింది. ఆ తల్లిదండ్రుల సంతోషం చూసి స్థానికులకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఇక దీని వెనుక ఉన్న అసలు కారణం చెప్పిన తర్వాత వాళ్లలో కొందరు ఆ తల్లిదండ్రులను అభినందించారు.

మధ్యప్రదేశ్‌లోని సాగర్ అనే ఊళ్లో ఓ విద్యార్థి టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఏకంగా నాలుగు సబ్జెక్టుల్లో తప్పాడు. భయంభయంగా ఇంటికెళ్లాడు. తండ్రికి విషయం చెప్పాడు. దీంతో వెంటనే అతని తండ్రి ఆనందంతో అతన్ని దగ్గరికి తీసుకొని, హగ్ చేసుకొని మురిసిపోయాడు. అతని ఫ్రెండ్స్, బంధువులు, స్థానికులందరికీ స్వీట్లు పంచి అతన్ని ఊరేగించాడు.

ఇంతకీ ఆ తండ్రి అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా.. ఇంత చిన్న వయసులో ఓటమి అనేది అతని నైతికస్థెర్యాన్ని దెబ్బ తీయకూడదు. ఇది అతని జీవితంలో చివరి పరీక్ష కూడా కాదు. పరీక్షలో తప్పినంత మాత్రాన ఏదైనా చేయరాని అఘాయిత్యం చేయకూడదనే ఇలా చేశామని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ విద్యార్థి తండ్రి చేసిన పనిని మెచ్చుకుంటూ స్థానికులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఓ రంగంలో విఫలమైనంత మాత్రాన జీవితంలో అన్ని దారులు మూసుకుపోవన్న సందేశం ఇవ్వడానికే ఇలా చేశాను. నా కొడుకు జీవితంలో ఉన్న ఎన్నో అవకాశాలను సానుకూలంగా అన్వేషించగలగాలి. ఎప్పుడూ వదిలిపెట్టేయాలన్న ఆలోచన అతనికి రాకూడదు అని తండ్రి సురేంద్ర చెప్పారు. తన తల్లిదండ్రులను చూసి మిగతా విద్యార్థుల పేరెంట్స్ కూడా ఇలాగే ఉండాలని ఆ విద్యార్థి చెబుతున్నాడు. ఇక తాను చదువు జోలికే వెళ్లనని, తన తండ్రి వ్యాపారమైన ట్రాన్స్‌పోర్టేషన్‌లో కెరీర్ వెతుక్కుంటానని చెప్పాడు.

3940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles