అరుదైన రికార్డు.. 4100 గాల్‌స్టోన్స్‌ను తొలగించారు!

Mon,May 28, 2018 04:02 PM

A Doctor from Nashik removed 4100 gallstones from a 43 year old patient

నాసిక్: గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో ఒకటి రెండు రాళ్లు ఉంటేనే విపరీతమైన కడుపు నొప్పి వేధిస్తుంది. అలాంటిది యోగేష్ అనే ఓ వ్యక్తి కడుపులో నుంచి ఏకంగా 4100 గాల్‌స్టోన్స్‌ను వెలికితీశారు నాసిక్‌లోని అమిత్ శరద్ కీలె అనే డాక్టర్. ఒక్కో రాయి 3 నుంచి 4 ఎంఎం సైజు ఉన్నట్లు డాక్టర్ శరద్ చెప్పారు. నాలుగు గంటల పాటు సర్జరీ చేసి రాళ్లను మొత్తం తొలగించారు.

ఆ తర్వాత ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది ఆ రాళ్లను లెక్కించగా.. మొత్తం 4100 ఉన్నట్లు తేల్చారు. ఈ రాళ్లను లెక్కించడానికీ రెండు గంటల సమయం పట్టడం విశేషం. ప్రస్తుతం యోగేష్ చికిత్సకు బాగానే స్పందిస్తున్నాడనీ, వచ్చే వారం అతన్ని డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్ శరద్ చెప్పారు. ఒబెసిటీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్, సమయానికి తినకపోవడం, జంక్ ఫుడ్స్ వల్ల ఈ గాల్‌స్టోన్స్ వస్తాయని, మహిళల్లో ఇవి సాధారణమైపోయానని ఆయన తెలిపారు.

ఎక్కువ గాల్‌స్టోన్స్‌ను వెలికి తీసిన రికార్డు మాత్రం బెంగాల్‌కు చెందిన డాక్టర్ ఎంఎల్ సాహా పేరిట ఉన్నట్లు శరద్ చెప్పారు. 2015లో ఆయన ఏకంగా 11950 గాల్‌స్టోన్స్‌ను సర్జరీ ద్వారా తొలగించినట్లు వెల్లడించారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలే ఇలా గాల్‌స్టోన్‌గా మారుతుందని శరద్ చెప్పారు. వీటిని తొలగించడానికి సర్జరీ తప్పనిసరి. ఇది ఒక్కోసారి పిత్తాశయ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles