దళిత పోలీసు పెండ్లి ఊరేగింపుపై దాడి

Tue,February 12, 2019 07:14 AM

A Dalit police personnel�s wedding procession was allegedly attacked

జోధ్‌పూర్: దళిత పోలీసు పెండ్లి ఊరేగింపుపై రాజ్‌పూత్ సమూహం దాడి చేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని దుగార్ గ్రామంలో గడిచిన ఆదివారం చోటుచేసుకుంది. పెండ్లికొడుకు సవాయ్ రామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. పెండ్లి అనంతరం ఊరేగింపు దుగార్ గ్రామం గుండా వెళ్తుండగా రాజ్‌పూత్‌కు చెందిన పలువురు ఒక్కసారిగా పదునైన కత్తులతో తమపై దాడి చేసినట్లు సవాయ్ తెలిపాడు. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించాడు. ఈ ఘటనలో మొత్తం 12 మందికి పైగా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ అజిత్ సింగ్ తెలిపారు.

2404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles