వరద బీభత్సం.. ఇంటి కప్పుపై మొసలి.. వీడియో

Mon,August 12, 2019 01:36 PM

A crocodile lands on roof of a house in flood affected Raybag taluk in Belgaum

హైదరాబాద్‌ : కర్ణాటక రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. సుమారు 2 వేలకు పైగా గ్రామాలు నీట మునిగాయి. గ్రామాల్లోకి వరద నీటితో పాటు మొసళ్లు, పాములు వచ్చి చేరుతున్నాయి. బెల్గాం జిల్లాలోని రాయ్‌బాగ్‌ తాలుకా పరిధిలోని ఓ గ్రామంలోకి మొసళ్లు వచ్చాయి. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో.. మొసళ్లు ఇండ్ల కప్పులపై సేద తీరుతున్నాయి. మొసళ్లను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఆగస్టు 1వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోత వర్షాలకు తోడు వరదలు పోటెత్తాయి. ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. మరో 14 మంది అదృశ్యమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక 5,81,702 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 50,595 జంతువులను వరదల నుంచి కాపాడారు. 3,27,354 మంది 1168 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ భారీ వర్షాలకు, వరదలకు 17 జిల్లాల్లోని 80 తాలుకాలు తీవ్రంగా నష్టపోయాయి. 2028 గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4.20 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. 28,325 ఇండ్లు ధ్వంసమయ్యాయి.2270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles