ఆ పార్టీకి ఓటేయండి చాలు.. అదే మీరు మా పెళ్లికి ఇచ్చే గిఫ్ట్!

Fri,January 18, 2019 06:12 PM

A couple in Haryana asking guests to vote for AAP as their wedding Gifts

న్యూఢిల్లీ: పెళ్లికి వచ్చిన వాళ్లు శుభాకాంక్షలు చెబుతూ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం కామన్. కొందరు గిఫ్ట్ వద్దు.. ఏదైనా చారిటీకి ఇవ్వండి అనీ అడుగుతుంటారు. కానీ హర్యానాలోని ఓ జంట మాత్రం తమ పెళ్లికి వచ్చే అతిథులను ఓ వింత గిఫ్ట్ కోరుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి చాలు.. మీరు మాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే అంటూ తమ పెళ్లి పత్రికలోనే చెబుతున్నారు. జస్విందర్ సింగ్, ఇందర్‌జీత్ కౌర్ అనే ఆ జంట వేసిన ఈ వినూత్న పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన ఫొటోలను ఆప్ సోషల్ మీడియా వ్యూహకర్త అంకిత్ లాల్ ట్విటర్‌లో షేర్ చేశారు. 2019 లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో ఆప్‌కు ఓటేయండి.. ఆ ఓటే మాకు గిఫ్ట్ అని ఆ పెళ్లి కార్డుపై ఉంది. ఆ కార్డుపై ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు గోపాల్ రాయ్, నవీన్ జైహింద్‌ల ఆటోగ్రాఫ్‌లు కూడా ఉన్నాయి. హర్యానాలో ప్రతిచోటా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీ చెప్పుకుంటున్నది. గత నవంబర్‌లో ప్రధాని మోదీకి ఓటేయండంటూ ఇలాగే కొన్ని వెడ్డింగ్ కార్డులు వచ్చాయి.
4679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles