అపార్ట్‌మెంట్ 12వ అంతస్తుపై నుంచి దూకి..

Thu,March 1, 2018 03:37 PM

A couple along with their son jumping off 12th floor


గుజరాత్: సూరత్‌లో విషాదఘటన చోటుచేసుకుంది. ఇద్దరు దంపతులు తమ ఐదేళ్ల కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్థుపై నుంచి దూకి ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో సూసైడ్ నోట్‌ను గుర్తించారు. ఆర్థిక సమస్యల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్‌లో రాసి ఉందని సిటీ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. సర్థానా జకత్ నకా ఏరియాలో ఈ ఘటన జరిగింది.

1079
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles