బీజేపీ కార్యకర్త హత్య

Mon,May 27, 2019 09:39 AM

A BJP worker Chandan Shaw was shot dead by unidentified assailants

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పారాగణ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన బీజేపీ కార్యకర్తను చందన్ షాగా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్త హత్యకు గురైన భటపారాలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చందన్ షా హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles