96 ఏళ్ల ఆ బామ్మ‌కు .. ల్యాప్‌ట్యాప్ గిఫ్ట్‌

Thu,November 8, 2018 04:39 PM

96 year old Kerala topper gets computer as gift

కొచ్చి: కేర‌ళకు చెందిన 96 ఏళ్ల కార్తియాని అమ్మ .. ఇటీవ‌ల జ‌రిగిన అక్ష‌ర ల‌క్ష్యం ప‌రీక్ష‌లో 98 మార్కులు సాధించి టాప్ ర్యాంక్ కొట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడా బామ్మ‌కు కేర‌ళ ప్ర‌భుత్వం ల్యాప్‌ట్యాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీ. ర‌వీంద్ర‌నాథ్‌.. ల్యాప్‌ట్యాప్‌ను ఆమెకు ప్ర‌దానం చేశారు. అక్ష‌ర‌ల‌క్ష్యంలో టాప్ ర్యాంక్ కొట్టిన కార్తియాని అమ్మ దేశ‌వ్యాప్తంగా అంద‌ర్నీ ఆక‌ర్షించింది. దీంతో ఆ రాష్ట్ర సీఎం విజ‌య‌న్ ఆ బామ్మ‌ను ఇటీవ‌ల స‌ర్టిఫికెట్‌తో స‌న్మానించారు. ఆ స‌మ‌యంలో కంప్యూట‌ర్ ప‌ట్ల ఉన్న ఆస‌క్తిని ఆమె సీఎంకు చెప్పింది. ఈ నేప‌థ్యంలో కార్తియాని అమ్మ‌కు ల్యాప్‌ట్యాప్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే ల్యాప్‌ట్యాప్ అందుకోగానే... మొద‌టిసారి ఆ అవ్వ త‌న పేరును ఇంగ్లీష్‌లో టైప్ చేసింది.

1292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles