తెలిసిన‌వాళ్లే.. అత్యాచారం చేస్తున్నారు !

Tue,October 22, 2019 08:19 AM

హైద‌రాబాద్‌: నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. 2017లో దేశ‌వ్యాప్తంగా 32,559 అత్యాచార సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు ఎన్‌సీఆర్‌బీ త‌న తాజా డేటాలో వెల్ల‌డించింది. సోమ‌వారం రిలీజైన ఆ నివేదిక‌లో ఓ సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పింది. 93.1 శాతం కేసుల్లో అత్యాచార బాధితుల‌కు నిందితులు తెలుసు అని రిపోర్ట్‌లో స్ప‌ష్టం చేశారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక‌లో తేట‌తెల్ల‌మైన అంశాలు ఇలా ఉన్నాయి.


30,299 రేప్‌ కేసుల్లో.. సుమారు 3155 కేసుల్లో నిందితులు కుటుంబ‌స‌భ్యులే. ఇక మ‌రో 16,591 కేసుల్లో.. అత్యాచారానికి పాల్ప‌డిన‌వారిలో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌, ఉద్యోగులు, ప‌క్కింటివారు, ఇత‌రులు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇక మ‌రో 10,553 కేసుల్లో.. నిందితుల జాబితాలో స్నేహితులు, ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌, లివిన్ పార్ట్న‌ర్‌లు, విడిపోయిన భ‌ర్త‌లు ఉన్నారు.

2017లో ఎక్కువ శాతం రేప్ కేసులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో సుమారు 5562 కేసులు రికార్డు అయ్యాయి. వీటిల్లో 97.5 శాతం కేసుల్లో నిందితులు తెలిసిన‌వాళ్లే. ఇక ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లో అత్య‌ధికంగా 3305 కేసులు న‌మోదు అయ్యాయి. ఆ కేసుల్లోనూ 87.9 శాతం తెలిసిన‌వాళ్లే అత్యాచారానికి పాల్ప‌డ్డట్లు నివేదిక చెప్పింది. మ‌హారాష్ట్ర‌లో న‌మోదు అయిన కేసుల్లో.. 98.1 శాతం మంది నిందితుల్లో స్నేహితులు, బంధువులే ఉన్నారు. మ‌ణిపూర్‌లో రికార్డు అయిన 40 కేసుల్లో.. నిందితులంతా బాధితుల‌కు తెలిసిన‌వాళ్లే కావ‌డం శోచ‌నీయం.

1879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles