అసోంలో ఘోర ప్రమాదం : 8 మంది మృతి

Wed,November 20, 2019 12:58 PM

దిస్‌పూర్‌ : అసోంలోని ఉదల్‌గురి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 15పై ఓరాంగ్‌ గెలబిల్‌ ఏరియా వద్ద కారు - ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles