దేశ రాజధానిలో పాముల బెడద

Sat,July 21, 2018 02:35 PM

8 foot python and 3 foot cobra captured in delhi

దేశ రాజధాని న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పాముల హల్‌చల్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పాములు పొదల్లో నుంచి బయటికి వచ్చి జనావాసాల్లో సంచరిస్తున్నారు. గత వారం ఇలాగే మూడు నాగుపాములు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో సంచరించాయి. తాజాగా.. తుగ్లకాబాద్‌లోని నర్దాన్ బస్తీలో కొండ చిలువ సంచరించింది. అది దాదాపు 8 అడుగుల పొడవు ఉన్న ఇండియన్ రాక్ పైథాన్.

ఓ రంధ్రంలో దాక్కొని ఉన్న కొండచిలువను గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది దాన్ని బంధించారు. ఇక.. మరో ప్రాంతం రోహిణిలో మూడు అడుగుల నాగుపాము హల్ చల్ చేయడంతో మళ్లీ అదే స్నేక్ హెల్ప్‌లైన్‌కు చెందిన సిబ్బంది వెళ్లి దాన్ని రక్షించారు. పాముల సంచారంతో ఈ హెల్ప్‌లైన్ సిబ్బందికి తెగ గిరాకీ పెరిగింది. రోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి తమకు ఫోన్ వస్తున్నదని.. వాటిని సురక్షితంగా కాపాడి.. దగ్గర్లోని అడవిలో వదిలేస్తుంటామని హెల్ప్‌లైన్ సిబ్బంది తెలిపారు.

3829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles