73 వేల మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్

Fri,April 26, 2019 10:12 AM

73000 Transgenders Arrested For Extorting Money From Rail Passengers

హైదరాబాద్ : ట్రాన్స్‌జెండర్లను చూడగానే కొందరికి వణుకు పుడుతుంది. బలవంతపు వసూళ్లకు పాల్పడుతారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తారని భయపడుతుంటారు జనాలు. ఇక రైళ్లల్లో ట్రాన్స్‌జెండర్ల ప్రవర్తన దారుణంగా ఉంటుంది. బలవంతంగా వసూళ్లు చేస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంటారు ట్రాన్స్‌జెండర్లు. రైళ్లల్లో ఆరాచకం సృష్టిస్తున్న ట్రాన్స్‌జెండర్ల వివరాలను, ఎంతమందిని అరెస్టు చేశారని.. ఓ ప్రయాణికుడు సమాచార హక్కు చట్టం కింద రైల్వే మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశాడు. గడిచిన నాలుగేళ్లల్లో 73 వేల మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేశామని రైల్వేశాఖ వెల్లడించింది. 2015లో 13,546 మంది ట్రాన్స్‌జెండర్లు, 2016లో 19,800, 2017లో 18,526, 2018లో 20,566, 2019, జనవరిలో 1,399 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేసినట్లు తెలిపింది. ట్రాన్స్‌జెండర్ల ఆగడాలను అరికట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎప్పటికప్పుడు రైళ్లను తనిఖీ చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది. రైల్వే శాఖలో శాంతిభద్రతలను మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ.

4293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles