వాళ్లను దేశం దాటించేశారు!

Thu,October 4, 2018 03:17 PM

7 Rohingya Muslims deported to Myanmar

గువాహటి: అక్రమంగా మన దేశంలో ఉంటున్న ఏడుగురు రోహింగ్యా ముస్లింలను తొలిసారి మయన్మార్‌కు పంపించేసింది ఇండియా. ఈ ఏడుగురిని 2012లో పట్టుకున్నారు. అప్పటి నుంచీ అస్సాంలోని సిల్చార్‌లో ఉన్న కచార్ సెంట్రల్ జైల్లో ఉంచారు. వీళ్లను తిరిగి పంపే విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ ఏడుగురిని మయన్మార్‌కు అప్పగించేశారు. మణిపూర్‌లోని మోరె బోర్డర్ పోస్ట్ దగ్గర ఆ ఏడుగురు రోహింగ్యాలను మయన్మార్ అధికారులకు అప్పగించినట్లు అస్సాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బోర్డర్) భాస్కర్ మహంత వెల్లడించారు.

వాళ్లు తమ పౌరులే అని మయన్మార్ స్పష్టంచేసిందని, రఖైన్ రాష్ట్రంలో వాళ్ల చిరునామాలు ఉన్నాయని భారత ప్రభుత్వం చెప్పింది. మయన్మార్ దౌత్యవేత్తలకు కాన్సులర్ అవకాశం ఇవ్వడంతో వాళ్లు ఆ అక్రమ వలసదారులను గుర్తించారు. మయన్మార్‌కు తిప్పి పంపిన వాళ్లలో మహ్మద్ జమాల్, మోహ్‌బుల్ ఖాన్, జమాల్ హుస్సేన్, మహ్మద్ యూనస్, సబీర్ అహ్మద్, రహీముద్దీన్, మహ్మద్ సలామ్ ఉన్నారు. వీళ్లందరూ 26 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్కులే.వాళ్లు కూడా తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపారని మరో అధికారి వెల్లడించారు.

1540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles