కొండచరియ విరిగిపడి ఏడుగురు మృతి, 26 మందికి గాయాలు

Sun,July 15, 2018 07:24 PM

7 killed and 26 injured after boulder rolls over

జమ్ము కశ్మీర్: రాష్ట్రంలోని రెయిసీ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శాయిరీబాబా జలపాతం వద్ద చోటు చేసుకుంది. సాయంత్రం 3:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. రెయిసీ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. చీనాబ్ నదిపైన 466 మీటర్ల ఎత్తుపై ఉన్న ఈ జలపాతం నార్త్ ఇండియాలో ఆకర్షనీయమైన వాటర్‌ఫాల్‌గా టూరిస్ట్‌లను ఆకట్టుకుంటుంది. పోలీసులు, మిలటరీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles