మున్నార్ రిసార్ట్‌లో చిక్కుకున్న 60 మంది పర్యాటకులు

Fri,August 10, 2018 03:10 PM

60 tourists stranded in Munnar resort as heavy rains lash

మున్నార్: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఇడుక్కి డ్యామ్‌కు చెందిన మరో రెండు గేట్లను ఎత్తివేశారు. అయితే పల్లివాసల్ వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో 60 మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాంట్లో 20 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. గత రెండు రోజులుగా టూరిస్టులు ఆ రిసార్ట్‌లోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. కేరళకు వెళ్లవద్దు అంటూ అమెరికా తమ టూరిస్టులకు నిషేధ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు కేరళలో వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 26కు చేరుకున్నది. ఇడుక్కి జిల్లాలో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. పర్యాటలకు నిషేధం విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్యామ్ గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో చిన్న చిన్న బ్రిడ్జ్‌లు, నదుల వద్ద ఎవరూ ఉండకూడందటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 24 డ్యామ్‌లు ప్రస్తుతం నిండుకున్నాయి. ఇడుక్కి డ్యామ్‌లోని నీటిని పెరియార్ నదికి వదులుతున్నారు. కేర‌ళ‌లో నీట మునిగిన ప్రాంతాల‌ను ఆదివారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్నారు.

1576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles