ఆ హోటల్‌లో ఆరుగురు మావోయిస్టులు..?

Wed,May 16, 2018 07:27 PM

6 suspected Maoists arrested from hotel in dhanbad

ధన్‌బాద్ : జార్ఖండ్ పోలీసులు అరుగురు అనుమానిత మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ధన్‌బాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో అనుమానిత మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు గిరిదిహ్ ఎస్పీ సురేంద్రకుమార్ తెలిపారు. ఆరుగురు వ్యక్తులను విచారించి..వారు తెలిపిన సమాచారం ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అరస్టైన వారిలో చిల్కారీ ఊచకోత ప్రధాని నిందితుడు, జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండి కుమారుడు జీతన్ మరాండి కూడా ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత గిరిదిహ్ అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. మే 25న ప్రధాని నరేంద్రమోదీ ధన్‌బాద్ పర్యటనలో భాగంగా పబ్లిక్ ర్యాలీలో పాల్గొననున్నారు. గొడ్డా జిల్లాలో ఆదాని గ్రూప్‌నకు చెందిన పవర్ ప్లాంట్‌కు శంకు స్థాపన చేయనున్నారు.

3210
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles