మోదీ 68వ పుట్టినరోజు.. 568 కిలోల లడ్డూ!

Mon,September 17, 2018 05:27 PM

568 KG Laddu unveiled by Union Ministers on the occasion of PM Modis Birthday

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 68వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం 568 కిలోల లడ్డూని ఆవిష్కరించారు కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వి. సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు మంత్రులు... ఈ భారీ లడ్డూను ఆవిష్కరించారు. ఈ సంస్థ ప్రధాని మోదీ పుట్టినరోజును స్వచ్ఛతా దివస్‌గా నిర్వహిస్తున్నది. గత నాలుగేళ్లలో దేశంలో పారిశుద్ధ్యం చాలా మెరుగుపడిందని ఈ సందర్భంగా జవదేకర్ అన్నారు. స్వచ్ఛత ప్రచారంలో భాగంగా 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని, నాలుగున్నర లక్షల గ్రామాలు బహిరంగ మలవిసర్జనరహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయని ఆయన చెప్పారు. పారిశుద్ధ్యం ఓ ఉద్యమంలా సాగిందని మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు.

2223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles