జెట్ టిక్కెట్లపై 50 శాతం రాయితీ

Fri,February 22, 2019 08:01 AM

50% discount on Jet airways ticket

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ మాత్రం టిక్కెట్లపై రాయితీలు ఇవ్వడంలో వెనుకంజ వేయడం లేదు. ఇప్పటికే పలుమార్లు డిస్కౌంట్ ఇచ్చిన సంస్థ.. ఈసారి మాత్రం సగం ధరకే విమాన టిక్కెట్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ రూట్ల ప్రీమియం, ఎకానమి క్లాస్ సీట్లకు కూడా వర్తించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు ఈ నెల 21 నుంచి, దేశీయ ప్రయాణికులు వచ్చే నెల 1 నుంచి ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు కచ్చితంగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని షరతు విధించింది సంస్థ. విమానయాన రంగంలో పోటీ తీవ్రంగా పెరుగడంతో సంస్థలు వినూత్న ఆఫర్లను తెరపైకి తీసుకొస్తున్నాయి.

908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles