ఐదేళ్ల బాలికపై సెక్యూరిటీగార్డు అత్యాచారం

Sun,September 10, 2017 10:41 AM

5 Year Old Raped Allegedly By Peon In Classroom In Delhi

న్యూఢిల్లీ : ఢిల్లీ బడుల్లో అకృత్యాలు ఆగడం లేదు. ర్యాన్ ఇంటర్నేషన్ స్కూల్ ఘటన మరవక ముందే మరో దారుణం వెలుగు చూసింది. రెండో తరగతి చదుతున్న బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించి విఫలమైన బస్సు కండక్టర్ ఆ విద్యార్థిని కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీగార్డే.. తన డ్యూటీని మరిచి అభం శుభం తెలియని చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఉత్తర ఢిల్లీలోని ఠాగూర్ పబ్లిక్ పాఠశాలలో ఐదేళ్ల బాలికపై పాఠశాల సెక్యూరిటీ గార్డు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

లంచ్ సమయంలో విద్యార్థులు లేని ఓ తరగతి గదికి ఐదేళ్ల బాలికను తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు సెక్యూరిటీగార్డు. ఇంటికెళ్లిన బాలికకు తీవ్రంగా రక్తస్రావం అవడం, నొప్పిగా ఉండటంతో జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. దీంతో విషయం వెలుగుచూసింది. అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీగార్డు వికాస్(40)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

1533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles