కాకినాడలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం

Thu,September 19, 2019 10:09 PM

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడలోని సినిమా రోడ్డులో ఓ ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. భాస్కర్ ఎస్టేట్స్ భవనం మధ్యలో నాలుగు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. కాంక్రీట్ పగలడంతో ఇనుపరాడ్లు ఇరిగిపోయాయి. ఈ అపార్ట్‌మెంట్‌ను 40 ఫ్లాట్లతో 15 ఏళ్ల క్రితం నిర్మించారు. పిల్లర్లకు పగుళ్లు రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆ భవనంలో నివాసముండే వారిని ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. కాకినాడ నగర పాలక సంస్థ అధికారులు భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని తొలగించాలంటూ నగర పాలక సంస్థ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.

1830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles