మహిళను బెల్ట్‌తో కొట్టిన పోలీసులు.. వీడియో

Tue,May 28, 2019 12:31 PM

5 Policemen Face Action After Video Shows Cops Thrashing Woman In Haryana

హైదరాబాద్‌ : హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను పోలీసులు బెల్ట్‌తో కొట్టారు. ఈ సంఘటన గతేడాది అక్టోబర్‌ నెలలో చోటు చేసుకోగా రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. ఓ కేసు విషయంలో ఓ మహిళను పోలీసు అధికారి బెల్ట్‌తో కొట్టారు. అక్కడే మరో నలుగురు పోలీసులు ఉన్నారు. అయితే మహిళను బెల్ట్‌తో కొట్టిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఫరీదాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్పందించారు. మహిళను బెల్ట్‌తో కొట్టిన ఘటనకు సంబంధించి ఇద్దరు హెడ్‌ కానిస్టేబుల్స్‌తో పాటు ముగ్గురు స్పెషల్‌ ఆఫీసర్‌ పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఐదుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రీటా భటియా డిమాండ్‌ చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలన్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని ఎవరూ నమ్ముతారు? అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు సంబంధించిన కేసులను మహిళా పోలీసు స్టేషన్లలోనే విచారించాలని ఆమె పోలీసు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

2547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles