కాంగ్రెస్ అభ్యర్థి హత్యకేసు..మరో ఐదుగురు అరెస్ట్

Thu,June 6, 2019 02:06 PM

5 more arrested in Congress candidate murder case


బెర్హంపూర్: గంజామ్ జిల్లాలోని అస్క అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ జెనా (46)హత్య కేసులో పోలీసులు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఓట్ల లెక్కింపు ముందురోజు అయిన మే 22న మనోజ్ జెనా దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో తాజాగా పోలీసులు ఆనంద్ స్వైన్, శంకర్ రౌత్, సిబరం బెహెరా, కార్తీక నాహక్, సునీల్ కుమార్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ జెనా హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే గణేశ్ నాయక్, హృషికేశ్ పాత్రా అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

మనోజ్ జెనా హత్యకేసులో ప్రధాన నిందితుడైన మద్యం వ్యాపారి భగవాన్ సాహును అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశామని బెర్హంపూర్ ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు బైకులు, క్రూడ్ పిస్తోళ్లు, మూడు రౌండ్ల మందుగుండ్లు, రెండు కత్తులు, పది సెల్‌ఫోన్లు, రూ.3500 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

1529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles