మైనర్ హత్య కేసు..ఐదుగురు మైనర్లు అరెస్ట్

Mon,August 27, 2018 01:53 PM

5 minor boys arrested for killing another minor

ముజఫర్‌నగర్ : మైనర్ బాలుడి హత్య కేసులో మరో ఐదుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 23న లథావాలా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో 14 ఏండ్ల జుబెర్ అనే బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జుబెర్‌పై రాళ్లతో దాడి చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న మందులు కొనుక్కుని వస్తానని ఇంటి నుండి బయటకు వెళ్లిన జుబెర్ తిరిగిరాలేదని అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ హరీశ్ భడోరియా తెలిపారు.

3178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles