హత్య కేసు..కానిస్టేబుల్ సహా ఐదుగురిపై కేసు

Wed,May 22, 2019 05:01 PM

5 booked in Shopkeeper murder case


ముజఫర్‌నగర్: షాపు యజమాని హత్య ఘటనకు సంబంధించి యూపీ పోలీసులు కానిస్టేబుల్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. షామ్లి జిల్లాలోని మజ్రా రోడ్డు ప్రాంతంలో అమిత్ షాపులోకి వచ్చి అమిత్ కుమార్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో అమిత్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అమిత్ కుమార్ భార్య పూజ, ఆమె సోదరుడు సుమిత్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. హత్య కేసులో వీరికి సహకరించిన కానిస్టేబుల్ విజయానంద్‌పై కూడా కేసు ఫైల్ చేశాం. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

2374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles