ముగిసిన నాలుగో విడుత పోలింగ్

Mon,April 29, 2019 05:19 PM

4th phase polling of lok sabha elections

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 9 రాష్ర్టాల్లోని 71 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 5 గంటల వరకు 50.06 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 373 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇవాళ మహారాష్ట్రలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, రాజస్థాన్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఒడిశాలో 6, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మే 6వ తేదీన జరిగే ఐదో విడుత పోలింగ్‌లో 51 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles