పుల్వామాలో నలుగురు ఉగ్రవాదులు హతం

Mon,April 1, 2019 10:51 AM

4 Terrorists Killed In Jammukashmir Pulwama

శ్రీనగర్‌ : పుల్వామాలోని లస్సీపూరాలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. లస్సీపూరా ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు నిన్న సాయంత్రం భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు.. ఉగ్రవాదులపై భీకరమైన కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హతమైన ఉగ్రవాదులను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో నాలుగు రైఫిల్స్‌, భారీ మందు గుండు సామాగ్రితో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles