వీడియో: ఏటీఎం మిషిన్‌నే ఎత్తుకెళ్లారు!Thu,November 16, 2017 08:08 AM

4 men steal with an ATM machine of Central Bank of India Rajasthan

రాజస్థాన్: ఎవరైనా ఏటీఎంలో దొంగతనం ఎలా చేస్తారు? ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులను దోచుకెళ్తారు. కాని... ఈ దొంగలు స్మార్ట్ దొంగలు. ఏటీఎంను పగులగొట్టడానికి ఎంతో కష్టపడాలి. అంత టైమ్ లేదనుకున్నారో ఏమో... ఏకంగా ఏటీఎం మిషన్‌నే దోచుకెళ్లారు. ఈ ఘటన బూందిలోని నైన్వాలో జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం మిషన్‌ను నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన మొత్తం ఏటీఎం సెంటర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎం మిషిన్‌లో రూ.5 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.2686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS