చిత్తూరులో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

Wed,July 24, 2019 12:05 PM

4 dead in road accident in chittoor dist

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నగరి సమీపంలోని కన్నమెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల నుంచి తిరిగివస్తున్న కారు, ఓ ప్రయివేటు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా తమిళనాడులోని అయ్యప్పతంగల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles