ముంబై ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో నలుగురు మృతి

Thu,March 14, 2019 09:10 PM

4 dead and 34 injured as foot over bridge collapses near Chhatrapati Shivaji Terminus in Mumbai

ముంబైలోని సీఎస్‌టీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫుట్ ఓవర బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారని, 34 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అపూర్వ ప్రభు(35), రంజన తాంబే(40), జాహిద్ శిరాజ్ ఖాన్(32) ను గుర్తించినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది.

అధికారుల కథనం ప్రకారం.. ఈ ఘటనలో చాలామందికి గాయాలయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో 10 మందిని జీటీ హాస్పిటల్‌కు తరలించారు. మరో 10 మందిని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌కు తరలించారు. ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జార్జ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆసమయంలో బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్న వాహనదారులకు కూడా గాయాలయ్యాయి.

సీఎస్‌టీ ప్లాట్‌పాం వన్ నార్త్ ఎండ్ నుంచి బీటీ లేన్‌ను ఫుట్ ఓవర్ బ్రిడ్జి కనెక్ట్ చేస్తుంది. బ్రిడ్జి కుప్పకూలిపోవడంతో సీఎస్‌టీ ప్రాంతంలో ట్రాఫిక్ స్థంబించింది. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించింది.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles