ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ బలపరిచింది: జైట్లీ

Mon,April 10, 2017 10:31 PM

33 members of the NDA met today under the Modi chairmanship


న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ బలపరిచిందని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. అన్ని రంగాల్లో ఎన్డీఏ కీలక నిర్ణయాలు తీసుకుందని జైట్లీ తెలిపారు. ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ ఎన్డీఏను సుస్థిరపరచాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇవాళ్టి సమావేశంలో శివసేన పాల్గొనడం మంచి పరిణామమని జైట్లీ అన్నారు. యూపీ ఎన్నికల తర్వాత ఎన్డీఏ సమూహం పెద్దదైందన్నారు. ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్ష నేతలంతా మాట్లాడారన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో 33 పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాయని తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలంతా చర్చించిన తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తామని పేర్కొన్నారు.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles