3 వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ సీజ్‌

Wed,November 2, 2016 03:42 PM

3,000 Crore worth Drugs Seized In Udaipur

న్యూఢిల్లీ: అతిపెద్ద డ్ర‌గ్స్ రాకెట్‌ను బ‌య‌ట‌పెట్టారు డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన నిషేధిత నార్కోటిక్ ఉత్ప్రేర‌కాన్ని ఓ ఫ్యాక్ట‌రీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్‌కు చెందిన ప్రొడ్యూసర్ సుభాష్ దుధానిని అరెస్ట్ చేశారు. అక్టోబ‌ర్ 28న మ‌రుధార్ డ్రింక్స్‌పై అధికారులు దాడి చేయ‌గా.. అందులో ఒక రూమ్ నిండా నిషేధిత మాండ్రాక్స్ టాబ్లెట్స్ క‌నిపించాయి. అందులో మొత్తం రెండు కోట్ల ట్యాబ్లెట్లు ఉండ‌గా.. వాటి బ‌రువు 23.5 మెట్రిక్ ట‌న్నుల‌ని, విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుంద‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్‌ (సీబీఈసీ) చైర్‌ప‌ర్స‌న్ న‌జీబ్ షా వెల్ల‌డించారు.

డీఆర్ఐ చ‌రిత్ర‌లో ఇంత‌పెద్ద డ్ర‌గ్స్ రాకెట్ ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. దీని వెన‌క ఉన్న సూత్ర‌ధారుల‌ను అరెస్ట్ చేశామ‌ని, ఈ రాకెట్‌లో పాలుపంచుకున్న అంద‌రినీ అరెస్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని న‌జీబ్ తెలిపారు. బీఎస్ఎఫ్ స‌హ‌కారంతో డీఆర్ఐ ఉద‌య్‌పూర్‌లోని ఈ డ్ర‌గ్స్ ఫ్యాక్ట‌రీపై దాడులు నిర్వ‌హించింది. ఇక్క‌డ త‌యారవుతున్న ఈ మాండ్రాక్స్ మాత్ర‌లను మొజాంబిక్‌, సౌతాఫ్రికాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు న‌జీబ్ చెప్పారు. గ‌త ఐదేళ్ల‌లో డీఆర్ఐ 540 కిలోల హెరాయిన్‌, 7409 కిలోల ఎఫిడ్రైన్‌తో పాటు ఇత‌ర నార్కోటిక్స్‌ను సీజ్ చేసింది.

2162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles