మళ్లీ ఎన్డీయేదే అధికారం!

Sun,May 19, 2019 07:01 PM

300 plus for NDA predicts Times Now exit poll

హైదరాబాద్ : నరేంద్ర మోదీనే మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని టైమ్స్ నౌ సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ సారి కూడా ఎన్డీఏనే అత్యధిక స్థానాలను గెలుచుకోబోతుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. అధికారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఈ సర్వే చెబుతోంది. ఎన్డీఏకు 306, యూపీఏకు 132 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. 104 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 స్థానాలు రాగా, యూపీఏకు 62, ఇతరులు 145 స్థానాల్లో గెలుపొందారు. సీ-ఓటర్ సర్వేలో ఎన్డీఏకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 స్థానాలు వస్తాయని తేలింది. జన్ కీ బాత్ సర్వేలో ఎన్డీఏకు 305, యూపీఏకు 124, ఇతరులకు 113 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది.

4522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles