వినోద‌పు ప‌న్ను ర‌ద్దు చేయండి : స‌్టాలిన్

Thu,July 6, 2017 11:46 AM

30 percent entertainment tax should be rolled back, demands MK Stalin

చెన్నై: త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్ల‌పై విధించిన 30 శాతం వినోద‌పు ప‌న్నును ఎత్తివేయాల‌ని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. వినోద‌పు ప‌న్ను, జీఎస్టీతో ఫిల్మ్ ఇండ‌స్ట్రీ న‌ష్ట‌పోతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. రెండు ప‌న్నుల పోటుతో సినిమా ప‌రిశ్ర‌మ షాక్‌కు గురైంద‌న్నారు. గ‌త నాలుగు రోజులుగా రాష్ట్రంలో సినిమా హాళ్ల‌ను బంద్ చేశారు. ప‌రిశ్ర‌మ న‌ష్ట‌పోతున్న‌ది కాబ‌ట్టి 30 శాతం వినోద‌పు ప‌న్నును ర‌ద్దు చేయాల‌ని స్టాలిన్ కోరారు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీపై ఇది డ‌బుల్ ట్యాక్స్ అని ఆయ‌న విమ‌ర్శించారు.

1046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles