40 మంది డాక్టర్లతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం

Sat,September 1, 2018 12:26 PM

30 doctors injured in road accident at Ahmed nagar bypass road

ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ బైపాస్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు రోడ్డుప్రమాదం జరిగింది. ముంబై టాటా క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన 40 మంది డాక్టర్ల బృందం ఔరంగాబాద్‌లో మెడికల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు బస్సులో బయల్దేరారు. అహ్మద్‌నగర్ బైపాస్‌పై వేగంగా వెళ్తున్న బస్సు.. కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా.. 30 మంది డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ డాక్టర్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

5115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles