Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ట్రిపుల్ తలాక్ బిల్లులో ఏముందంటే..

Thu,December 28, 2017 01:11 PM

3 years jail for instant Talaq Bill proposes

న్యూఢిల్లీః చారిత్రాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లును ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది చట్టమైతే గనక ముస్లిం మహిళల చేతికి మంచి అస్త్రం చిక్కినట్లే. నాన్‌బెయిలబుల్ వారెంట్, మూడేళ్ల జైలు శిక్షలాంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లులో కేంద్రం చేర్చింది. ఈ బిల్లును ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ఈ బిల్లును రూపొందించింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్తపై భార్య.. మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కల్పించాలని కోరవచ్చు. బిల్లు ప్రకారం.. ట్రిపుల్ తలాఖ్ అని భర్త నోటితో చెప్పినా, రాత పూర్వకంగా తెలిపినా, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సప్ సందేశాలను పంపినా అక్రమమే. జమ్ము కశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయొచ్చు. ఈ చట్టం ప్రకారం దోషిగా తేలితే మూడేండ్ల జైలుతోపాటు జరిమానా కూడా విధిస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఇప్పటి వరకు 177 ట్రిపుల్ తలాఖ్ కేసులు నమోదు కాగా, వాటిలో 66 కేసులతో యూపీ తొలి స్థానంలో నిలిచింది. దీంతో ఈ అంశంపై చట్టం తేవాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర అధికారి ఒకరు తెలిపారు.

3060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles