తాళమేసి ఉన్న ఇంట్లో చిన్నారి మృతదేహం

Tue,July 16, 2019 05:51 PM

3-year-old boy who was kidnapped found in Kolar today


మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌ ఘటన కేసును పోలీసులు చేధించారు. అయితే చిన్నారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. జులై 14న గెహున్‌ ఖేడా ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు విపిన్ మీనా అనే వ్యక్తి మూడేళ్ల కొడుకును కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు కోలార్‌లో ఉన్న ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

తాళం వేయబడి ఉన్న ఓ ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని (కాలిపోయిన మృతదేహం) గుర్తించాం. చిన్నారిని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి చంపేశారా ? లేదా ఆ ఇంట్లోనే చంపేశారా ? అనే విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాం. సంఘటనాస్థలంలో కొన్ని ఆధారాలు సేకరించాం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని భోపాల్‌ డీఐజీ ఇర్షద్ వలీ తెలిపారు.

1868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles