గత రెండేళ్లలో 3 లక్షల మంది జాబ్స్ ఊడిపోయాయ్..!

Sat,May 5, 2018 03:29 PM

3 Lakh people lost jobs in Kerala mostly women

ఒక్కరివి కావు.. ఇద్దరవి కావు.. ఏకంగా మూడు లక్షల మంది జాబ్స్ ఊడిపోయాయ్. అందులో మహిళలే ఎక్కువ. ఈ జాబ్స్ ఊడిపోయింది ఎక్కడో తెలుసా? కేరళ రాష్ట్రంలో. ఎందుకో తెలుసుకుందాం పదండి.

అది కేరళలోని కొల్లం జిల్లా. అక్కడ ఎక్కువగా జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్స్‌ను నెలకొల్పారు. ఒక్క కొల్లం లోనే కాదు.. కేరళలోని పలు ప్రాంతాల్లో కలిపి మొత్తం 834 జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ కంపెనీలు దాదాపు మూడు లక్షల మంది వర్కర్లను పనిలోకి తీసుకున్నాయి. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. కాని.. గత రెండేళ్లలో ఆ మూడు లక్షల మంది జాబులు పోయాయి. దీంతో వాళ్లంతా ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. 834 యూనిట్లలో ప్రస్తుతం 700 యూనిట్లను మూసేశారు.

జీడిపప్పును ప్రాసెస్ చేసే కంపెనీలు జీడిగింజలను వేరే కంపెనీల నుంచి కొంటాయి. అయితే.. ఆయా కంపెనీలు జీడిగింజల రేటును ఒకేసారి పెంచాయి. దీంతో ప్రాసెసింగ్ కంపెనీలకు ఇది భారంగా మారింది. వర్కర్లకు శాలరీలు ఇస్తూ ఎక్కువ ధరకు జీడిగింజలను కొనుగోలు చేయడం కంపెనీలను ఆర్థిక సమస్యల్లో నెట్టింది. జీడి గింజల రేటు అలా పెరుగుతూ పోతుండటంతో ప్రాసెసింగ్ యూనిట్లన్నీ మూసుకోవాల్సి వచ్చింది.

"రేటు పెరుగుదలకు తోడు.. ఇంపోర్ట్ డ్యూటీని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇదివరకు జీరో ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. తర్వాత 2015లో కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని 9.36 శాతం చేసింది. దీంతో చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లకు పెరిగిన జీడిగింజల ధర, ఇంపోర్ట్ డ్యూటీని కట్టడం సాధ్యం కాలేదు. అందుకే వర్కర్లను పనిలోనుంచి తీసేసి కంపెనీని మూసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంపోర్ట్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించారు. కాని.. ఇది కట్టడం కూడా చాలా కష్టం. ఇక.. మా దగ్గర కట్టడానికి ఏమీ మిగల్లేదు.." అంటూ బోరుమన్నాడు ఓ ప్రాసెసింగ్ యూనిట్‌లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తి శశిధరన్ ఆచారి. ఎన్నో సార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మా సమస్యలు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడు.. అని ఆచారి తెలిపాడు.

"ఆ కంపెనీలు ఉన్నప్పుడు వారానికి ఓ 1500 దాకా సంపాదించేదాన్ని. దాదాపు 15 ఏండ్లుగా ఆ పని చేస్తున్నాను. కాని.. 2016లో మా కంపెనీని మూసేశారు. దీంతో మా కంపెనీ వర్కర్లమంతా రోడ్డున పడ్డాం. గత రెండేళ్లుగా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నా. నా తల్లి, కొడుకును నేనే సాదాలి. దాని కోసం ఇండ్లలో పని చేస్తున్నా. అయినా ఖర్చులకు సరిపోవట్లేదు.." అంటూ కన్నీరు కారుస్తూ తెలిపింది 39 ఏండ్ల బిందు.

2497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles