తృణమూల్-బీజేపీ మధ్య ఘర్షణ.. ముగ్గురు మృతి

Sun,June 9, 2019 07:50 AM

3 Killed As Trinamool, BJP Workers Clash In Bengal

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని 24 పరగాణాల జిల్లాలో నిన్న రాత్రి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఒకరు తృణమూల్‌కు చెందిన వ్యక్తి కాగా మరో ఇద్దరు బీజేపీకి చెందినవారు. బహిరంగ ప్రదేశాల్లో పార్టీ జెండాలను తొలగించిన విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రం నుంచి నివేదిక కోరినట్లు సమాచారం.

2446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles