బెంగళూరు ఎయిర్‌పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత

Sun,February 14, 2016 01:53 PM

3 kgs gold seized in bangalore airport

బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తోన్న మూడు కిలోల, రెండు వందల గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ వీల్ చెయిర్‌లో నుంచి లేచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అనుమానంతో పట్టుకుని విచారించారు. ఈమెను హైదరాబాద్‌కు చెందిన కొండూరు తులసమ్మ అనే స్మగ్లర్‌గా గుర్తించారు. హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్ ఆట కట్టించారు.

1242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS