ఒకే స్థానానికి ముగ్గురు జనసేన అభ్యర్థులు నామినేషన్

Tue,March 26, 2019 12:50 PM

3 Janasena leaders files nomination for Bapatla constituency

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయితే గుంటూరు జిల్లాలోని బాపట్ల అసెంబ్లీ స్థానానికి జనసేన పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రైల్వే కాంట్రాక్టర్ పులుగు మధుసూదన్ రెడ్డి పార్టీ నుంచి బీ-ఫారం అందుకుని నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సన్నిహితుడైన ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు బాపట్ల స్థానం కేటాయించి.. మధుసూదన్‌రెడ్డి బీ-ఫారంను రద్దు చేశారు. దీంతో లక్ష్మీనరసింహ బాపట్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నుంచి బీ-ఫారం లేకపోయినప్పటికీ తానే అభ్యర్థినంటూ జనసేనకు చెందిన మరో నాయకుడు బీకే నాయుడు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇలా ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు బాపట్ల అసెంబ్లీ స్థానంలో ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ముగ్గురిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు గందరగోళంలో పడ్డారు.

3428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles