ఆస్థి వివాదం..ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి

Fri,April 27, 2018 12:06 PM

3 Family members died in property Dispute


న్యూఢిల్లీ : ఆస్థివివాదం ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రాణాల మీదికి వచ్చింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఆస్తి వివాదంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడిన ఘటన ఢిల్లీ మోడల్ టౌన్‌లో వెలుగుచూసింది. ఆస్తికి సంబంధించి గుర్జీత్, జాస్పల్ (అన్నదమ్ములు) నిన్న రాత్రి గొడవపడ్డారు. గుర్జీత్‌పై అతని సోదరుడు కత్తులతో దాడి చేశాడు. గుర్జీత్‌కు తీవ్రగాయాలవడంతో అతని సెక్యూరిటీ గార్డు జాస్పల్, అతని భార్య ప్రభ్‌జ్యోత్‌పై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలతో ఉన్న గుర్జీత్, జాస్పల్, ప్రభ్‌జ్యోత్‌లను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

1751
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles