కారు ఆపి భోజనం చేస్తుండగా దోపిడీ..ముగ్గురు అరెస్ట్

Wed,March 20, 2019 04:54 PM

3 arrested For robbery on Taxi Driver


న్యూఢిల్లీ: ట్యాక్సీ డ్రైవర్‌పై దోపిడీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 29న ట్యాక్సీ డ్రైవర్ జితేందర్ ఓ ప్రయాణికుడిని గమ్యానికి చేర్చిన తర్వాత ఐఎస్‌బీటీ ఆనంద్ విహార్ ప్రాంతంలో కారు ఆపాడు. జితేందర్ కారు దగ్గర భోజనం చేస్తుండగా..ఇంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారు. జితేందర్‌ను బెదిరించి అతని దగ్గరున్న రెండు మొబైల్ ఫోన్లు, రూ.6వేల నగదుతోపాటు కారును ఎత్తుకెళ్లారు. దీంతో జితేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి..హర్‌దీప్‌సింగ్, విక్కీ, సన్నీ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ జస్మీత్ సింగ్ వెల్లడించారు. నిందితులను సుల్తాన్‌పురి ప్రాంతంలో పట్టుకోగా..వారి వద్దున్న కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

2831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles