ఆ హాస్ప‌ట‌ళ్లో 290 మంది చిన్నారులు చ‌నిపోయారు..

Wed,August 30, 2017 06:12 PM

290 children died at BRD Medical College this August, says its Principal

గోర‌ఖ్‌పూర్: ఇటీవ‌ల గోర‌ఖ్‌పూర్‌లోని బీఆర్డీ హాస్ప‌ట‌ల్లో సుమారు 70 మంది చిన్నారులు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఆ సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. అయితే తాజాగా బీఆర్డీ కాలేజీ ప్రిన్సిప‌ల్ పీకే సింగ్‌ మ‌రో విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఒక్క ఆగ‌స్టు నెల‌లోనే ఆ హాస్ప‌ట‌ల్లో సుమారు 290 మంది చిన్నారులు చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. అందులో 213 మంది నియోనాట‌ల్ ఐసీయూలో, మ‌రో 77 మంది చిన్నారులు ఎన్‌సెఫ‌లైటిస్ వార్డులో ప్రాణాలు విడిచిన‌ట్లు ప్రిన్సిప‌ల్ చెప్పారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి హాస్ప‌ట‌ల్లో 1250 మంది శిశువులు చ‌నిపోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎన్‌సెఫలైటిస్‌, ఇన్‌ఫాంట్ వార్డుల్లో ఎక్కువ మ‌ర‌ణాలు సంభవించిన‌ట్లు ప్రిన్సిప‌ల్ చెప్పారు. ప్రిమాచ్యూర్ డెలివ‌రీ వ‌ల్ల శిశువులు ర‌క‌ర‌కాల రుగ్మ‌త‌ల‌తో జ‌న్మిస్తున్నార‌ని తెలిపారు. ఒక‌వేళ పేషెంట్ల‌ను ముందుగానే హాస్ప‌ట‌ల్‌కు తీసుకువ‌స్తే, వాళ్ల ప్రాణాల‌ను కాపాడే అవకాశాలున్నాయ‌న్నారు.

1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles