అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ బరిలో 29 మంది క్రిమినల్స్‌

Tue,April 9, 2019 01:47 PM

29 candidates have criminal records in Arunachal Assembly polls

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికలతో పాటు పదవీకాలం పూర్తయిన ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా రాష్ర్టాలకు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. 60 శాసనసభ స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి 184 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 29 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. 9 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఏడుగురు బీజేపీ అభ్యర్థులు, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన ఒకరు నేరచరిత్ర కలిగిన జాబితాలో ఉన్నారు. మిగతా వారు స్వతంత్రులు. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వారు 6 శాతం ఉంటే.. ఇప్పుడు అది 16 శాతానికి చేరింది. ఇక ఈ ఎన్నికల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ మొత్తం 60 స్థానాల్లో పోటీ చేస్తోంది.

659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles