లవర్ వద్దకు అర్ధరాత్రి వెళ్తే చంపేశారు..

Mon,October 22, 2018 12:58 PM

27 year old man killed by his lover parents in Tamilnadu

కోయంబత్తూర్ : ఓ ప్రేమికుడు తన ప్రేయసి వద్దకు అర్ధరాత్రి వెళ్లాడు.. ప్రియురాలి తల్లిదండ్రులు.. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని హత్య చేశారు. ఈ దారుణ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నమ్మకల్ జిల్లాలోని పెరూంపారైకి చెందిన కే ధర్మరాజ్(27) అనే యువకుడు ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎక్కత్తూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక తొమ్మిదో తరగతి వరకు చదివి ఇంటి దగ్గరే ఉంటూ.. స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తోంది. అయితే ధర్మరాజ్‌కు ఈ బాలికకు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో వారు.. ప్రేమికులిద్దరిని మందలించారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు.

అయితే ధర్మరాజ్ తన ఫ్రెండ్ సహాయంతో.. అమ్మాయి వాళ్ల ఇంటికి ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు చేరుకున్నాడు. ఇంటి వెనుక డోర్‌లో నుంచి ఇంట్లోకి వెళ్లిన ధర్మరాజ్.. తన ప్రేయసితో సన్నిహితంగా ఉన్నాడు. విషయాన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు ధర్మరాజ్‌పై దాడి చేశారు. తీవ్రంగా చితకబాదారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ధర్మరాజ్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దాడి నుంచి ధర్మరాజ్ ఫ్రెండ్ తప్పించుకున్నాడు. ధర్మరాజ్ మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. మొత్తానికి విషయం పోలీసులకు తెలియడంతో ఎక్కత్తూరుకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ కుమారుడిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

4392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles