ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం

Wed,February 13, 2019 09:47 AM

250 huts gutted in major fire in slum in Delhi�s Paschim Puri

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగి 24 గంటలు కూడా పూర్తి కాకముందే బుధవారం తెల్లవారు జామున మరో అగ్నిప్రమాదం సంభవించింది. పశ్చిమపురి ప్రాంతంలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 250కి పైగా గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. 26 ఫైర్‌ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి ఓ గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లు తెలిసింది. ప్రధానంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా పొగమయంగా మారిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాత్రివేళ దుర్ఘటన జరగడంతో గుడిసెల్లో నివసిస్తున్న వారంతా చలిలోనే ఉండాల్సి వచ్చింది. తమ సామాగ్రి మొత్తం కాలిపోయిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా.. 35 మందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.


2176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles