ఏపీ.. 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌

Fri,June 7, 2019 11:05 AM

25 mlas sworn as ministers in Andhra Pradesh on June 8

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో 25 మందితో రేపు పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు కానుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారు. మంత్రివర్గంలో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్‌ తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తాం. అప్పుడు కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు జగన్‌. మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలిచింది.

5177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles