శ్రీలంకలో చిక్కుకున్న ఏలూరు యాత్రికులు

Mon,April 22, 2019 12:37 PM

20 members of eluru tourists in Srilanka

హైదరాబాద్‌ : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 20 మంది యాత్రికులు శ్రీలంకలో చిక్కుకున్నారు. శక్తిపీఠం దర్శనానికి 20 మంది ఏలూరు నుంచి శ్రీలంకకు ఇటీవలే వెళ్లారు. అయితే ఆ 20 మంది ఇవాళ కొలంబో నుంచి ఇక్కడికి తిరిగి రావాల్సి ఉండే. నిన్న చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల కారణంగా శ్రీలంకలో కర్ఫ్యూతో పాటు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. దీంతో ఏలూరు వాసుల సెల్‌ఫోన్లు పని చేయకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని సురక్షితంగా ఏపీకి తీసుకురావాలని అధికారులకు వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 600 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

1033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles