హుమ్.. యమ్మీ యమ్మీ చాకోలేట్ వినాయకుడు...!

Fri,September 14, 2018 06:33 PM

20 Chefs Take 10 Days To Build This Chocolate Ganesha

వినాయక చవితి మొదలైంది. గణేశ్ భక్తులు నవరాత్రులను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కొంతమంది గణేశ్ మీద ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటున్నారు. కొంతమంది బాహుబలి గణేశ్ ను తయారు చేస్తే.. మరికొంతమంది అరిసెలు, జలేబీలు...లాంటి స్వీట్లు, తినుబండారాలతో తయారు చేస్తున్నారు. ఇంకొంతమంది డబ్బులతో తయారు చేశారు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు గణేశ్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు మనం చదవబోయే స్టోరీ కూడా అటువంటిదే. ఈ గణపతిని మీరు చూశారంటే మీ నోరూరడం ఖాయం. గణపతిని అమాంతం కొరుక్కుతినేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ గణపతిని మొత్తం చాకోలేట్‌తో చేశారు.

అవును.. మీరు చదివేది నిజమే. చాకోలేట్ గణపతిని చేయడం ఇదే కొత్తేమీ కాదు. వరుసగా ఇది మూడో ఏడాది వాళ్లు ఇలా చాకోలేట్ గణపతిని తయారు చేయడం. దీన్ని తయారు చేయడానికి 10 రోజుల సమయం తీసుకున్నారట. 20 మంది చెఫ్స్ కలిసి 65 కిలోల చాకోలేట్‌తో ఈ గణేశుడిని తయారు చేశారట. పర్యావరణహిత గణేశుడిని మాత్రమే పూజించాలని జనాలకు చెప్పడం కోసమే ఇలా చాకోలేట్ గణేశ్‌ను తయారు చేశారట. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఓ రెస్టారెంట్ ఓనర్ హర్జిందర్ సింగ్ కుక్రెజా ఈ చాకోలేట్ వినాయకుడిని చేయించాడు. ఈ గణేశుడి పూజలు పూర్తయ్యాక.. గణేశుడిని పాలల్లో నాన్చి దాని ద్వారా తయారు చేసిన ప్రసాదాన్ని లుథియానాలోని స్లమ్ ఏరియాలో ఉండే నిరుపేద పిల్లలకు పంచుతారట. వావ్.. వాట్ ఆన్ ఐడియా సర్‌జీ.. సూపర్. ఇక.. ఈ చాకోలేట్ గణేశుడి ఫోటోలను హర్జిందర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా... ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

2663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles