ఎస్పీని చంపిన ఇద్దరు నక్సల్స్‌కు మరణశిక్ష

Wed,September 26, 2018 06:46 PM

2 NAXALS GET DEATH FOR KILLING SP

జార్ఖండ్‌లో ఎస్పీతో సహా ఆరుగురిని హత్యచేసిన ఇద్దరు నక్సలైట్లకు స్థానిక కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం పాకూర్ ఎస్పీ అమర్జీత్ బలిహార్, మరో ఐదుగురు పోలీసులు దుమ్కాలో సమావేశం ముగించుకుని పాకూర్ తిరిగి వెళ్తుండగా కత్తికుండ్ సమీపంలో నక్సల్స్ మెరుపుదాడి జరిపి చంపేశారు. ఈ కేసులో ఆరుగురిని సరైన సాక్ష్యాలు లేవనే కారణంతో దుమ్కా జిల్లా అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. సనాతన్ బస్కీ, సుఖ్‌లాల్ ముర్ము అలియాస్ ప్రవీర్‌దా అనే ఇద్దరిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. బిహార్, జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రవీర్‌దా ప్రస్తుతం వేరే హత్యకేసులో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్నారు.

5778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS